
తెలంగాణలో నూతనంగా నిర్మించిన సచివాలయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ ఇవాళ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్నదే ఈ సమావేశంలో చర్చనీయాంశమైంది. ఇందుకోసం ఎలాంటి ప్రణాళికను అమలు చేయాలనేదే చర్చలో ఉన్నట్టు సమాచారం.
ఈ సమావేశంలో తొమ్మిది మండలాలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని ఎంతో విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ దశాబ్దంలో మన ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో వారికి అర్థమయ్యేలా చెప్పగలిగితే మళ్లీ అధికారంలోకి వస్తామని సూచించారు.
