బస్సు రన్నింగ్‌లో ఉండగానే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అయితే, తన ప్రాణం కన్నా ప్రయాణికుల గురించిన ఆ డ్రైవర్ బస్సును పక్కకు ఆపి తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన ఒడిశా రాష్ట్రం బాలాసోర్ జిల్లాలోని పటాపూర్ చక్‌లో జరిగింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బస్సులో యాత్రికులు బాలాసోర్‌లోని పంచ లింగేశ్వరాలయం వెళుతుండగా డ్రైవర్ షేక్ అక్తర్ కు గుండెపోటు వచ్చింది. కానీ, డ్రైవర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సును పక్కకు ఆపి స్పృహ కోల్పోయాడు. గుండెపోటు వచ్చినా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి.. తమ ప్రాణాలు కాపాడాడని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read.. కాంగ్రెస్ నాయకులపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకుల బృందం
