బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఈ మధ్య గాయపడిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. ఈ మేరకు ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో ఆయన నడుముకి బెల్ట్ పెట్టుకుని క్రచస్ సపోర్టుతో నిల్చోని కనిపించారు. మీలో ఎంతమందికి క్రచస్ వీల్ చైర్ అవసరం వచ్చింది..అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటూ పోస్ట్ పెట్టారు. తనని తాను మోటివేట్ చేసుకుంటూ దాన్నుంచి కోలుకుంటున్నానని తెలిపారు. టైగర్ ష్రాఫ్, వరుణ్ దావన్, వాణీ కపూర్ తదితర సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొన్నిరోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నారని..ఈ మేరకు వార్ 2 మూవీ షూటింగ్ వాయిదా పడే అవకాశాలున్నాయని బాలీవుడ్ మీడియా పేర్కొంది.
ఇది కూడా చదవండి: మహిళల కోసం పెబుల్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్ లు రిలీజ్..ధర, ఆఫర్ వివరాలివే..!!
