కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని రంగాల అభివృద్ధి సాధిస్తున్నా, అన్ని వనరులు, సౌకర్యాలు ఉన్న మహారాష్ట్రలో ఎందుకు అభివృద్ధి సాధించలేకపోతున్నారని బీఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా షోలాపూర్ జిల్లా సర్కోలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దేశంలో అభివృద్ధి ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ అన్నారు. దాదాపు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిందని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, శివ, బీజేపీలకు అవకాశం ఇచ్చారు.
“అన్ని పార్టీలు మా గురించి ఆందోళన చెందుతున్నాయి. బీఆర్ఎస్ను బీజేపీ బీ-టీమ్ అని విమర్శించారు. బీఆర్ఎస్ రైతులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో మేము ముందుకు సాగుతున్నాము. దేశం కొత్త దిశలో వెళ్లాలి” అని కేసీఆర్ అన్నారు. అన్నారు.
