వైద్యారోగ్య శాఖలో 1828 నర్సుల పోస్టుల నోటిఫికేషన్, రాష్ట్రంలో బీసీ గురుకుల కళాశాల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నల్గొండ జిల్లా నడిబొడ్డున ఉన్న నాగార్జున డిగ్రీ కళాశాలలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్లు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం 1,001 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి అణగారిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబాపూల్ స్ఫూర్తి అని చెప్పారు. విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించి విద్యార్థులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. శంకర్, గోపాల్, లింగస్వామి, వెంకన్న, నరేష్, శ్రీశైలం, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
