పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కారు ప్రమాదానికి గురయ్యారు. ఆమె బుధవారం బర్ధమాన్ నుండి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా కారు ప్రమాదం బారినపడినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం.. రోడ్డు మార్గంలో బయలుదేరారు. అయితే మమత కాన్వాయ్‌కు అకస్మాత్తుగా మరో కారు ఎదురుగా వచ్చింది. దాంతో కారు డ్రైవర్ సడెన్ బ్రేక్‌లు వేయడంతో సీఎం మమత స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను మరో కారులో కోల్‌కతాకు తీసుకువస్తున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి.
Read Also: చూస్తుండగానే కూలిన విమానం.. 65 మంది యుద్ధ ఖైదీలు దుర్మరణం
