మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలం బొంబాయి గూడ గ్రామంకు చెందిన పగిడి రజిత (25) అనే గర్భిణి డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది. డ్యూటీ డాక్టర్, సిబ్బంది నార్మల్ డెలివరీ చేసారు. ఈ క్రమంలో నవజాత శిశువు మృతి చెందింది. కాగా, డ్యూటీ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే శిశువు మృతి చెందిందని బంధువుల ఆందోళన చేపట్టారు. డాక్టర్, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read.. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన రేవంత్ సర్కార్
