నిర్మల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో దాడి చేశారు. ఇందులో ఒకరు మృతి చెందగా..తీవ్రంగా గాయపడ్డ మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాకదర సంఘటన నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ జంగల్ హనుమాన్ వద్ద శుక్రవారం జరిగింది.
Also Read.. కాళేశ్వరంపై విచారణ చేసుకోండి.. కానీ రైతులను ఆదుకోండి
ఈ దాడిలో బుచ్చన్న(55) అనే వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందాడు. దాడి అనంతరం దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని, గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
The post బైక్పై వెళ్తుండగా గొడ్డలితో దాడి.. ఒకరి మృతి appeared first on tnewstelugu.com.
