శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హోండా షోరూం భవనం కుప్పకూలింది. బోరు వేస్తుండగా ఆ వైబ్రేషన్ కి బిల్డింగ్ కుప్పకూలింది. కొత్త వాన వాహనాలపై భవనం కుప్పకూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఏం జరుగుతుందో తెలియని ఉద్యోగులు షో రూం నుంచి బయటకు పరుగులు తీశారు.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ భవనం కొన్ని సంవత్సరాల నాటిది కావడంతో శిథిలావస్థలో ఉన్న భవనం.. గోరు వేస్తుండగా వైబ్రేషన్ రావడంతో తట్టుకోలేక కుప్పకూలింది.మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోక పోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చాలానే ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి రైల్వే కానిస్టేబుల్ దుర్మరణం
The post బోరు వేస్తుండగా కుప్పకూలిన హోండా షోరూం బిల్డింగ్ appeared first on tnewstelugu.com.
