
ఈడీ దర్యాప్తును సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను 3 వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. కవిత తరపున లాయర్ కపిల్ సిబల్ వాదించారు. విచారణకు రావాలని కవితకు నోటీసులో పేర్కొన్నారు. ఆమె నిందితురాలు కాకపోతే విచారణకు ఎలా ఉపక్రమిస్తారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఈడీ దర్యాప్తు సరికాదని కవిత పిటిషన్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో దాదాపు 10 నిమిషాల పాటు వాదనలు సాగాయి. ఈ క్రమంలో కవిత వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈడీ తీరును కాస్త సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈడీకి వ్రాతపూర్వక వాదనలు అందించాలని సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
