
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు భక్తులతో కిటకిటలాడింది. నేడు హనుమాన్ జయంతి కావడంతో కొండగాటు అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. అంజన్న క్షేత్రం యాత్రికులు, భక్తులతో కిటకిటలాడింది. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సభకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారని అంచనా.
