
నీటి పొదుపు చర్యలకు సంబంధించి జాతీయ నీటి అవార్డుల విభాగంలో భద్రాద్రి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో ముల్కలపల్లి మండలం జగన్నాథపురం గ్రామపంచాయతీలో మొదటి స్థానంలో నిలిచింది. జగన్నాథపురం గ్రామం ప్రథమ స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు.
భద్రాద్రి జిల్లాకు జాతీయ స్థాయిలో మొదటి పట్టం దక్కిందని కేంద్ర జల, విద్యుత్ శాఖ కార్యదర్శి లేఖ పంపినట్లు కలెక్టర్ తెలిపారు. నీటి పొదుపు చర్యలు చేపట్టిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందిని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రశంసించారు.
