పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో సానియా మీర్జా వివాహబంధంపై ఎప్పటి నుండి గాసిప్స్ వస్తున్నాయి. వీరిద్దరి వైవాహిక జీవితం ఎప్పుడో ముగిసిందని అందరు అంటున్నా అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు. అయితే నేడు ఉదయం తాజాగా సానియా మాజీ భర్త క్రికెటర్ షోయబ్ మాలిక్, పాక్ నటి సనా జావెద్ ను పెళ్లాడినట్టు సోషల్ మీడియాలో ఫొటోలు దర్శనమిచ్చాయి. అయితే ఇటీవల సానియా ఇన్ స్టాగ్రామ్ లో విడాకుల గురించి ఇన్ డైరెక్ట్ గా పోస్టు పెట్టడం, ఇప్పుడు షోయబ్ రెండో పెళ్లి ఫొటోలు తెరపైకి రావడంతో సానియా విడాకులపై ఓ స్పష్టత వచ్చింది.
దీనిపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తన కూతురు సానియా మీర్జా ఖులాని ఎంచుకుందన్నారు. ఇస్లాంలో ఖులా అంటే విడాకులు అని అర్ధం. అయితే ఖులాపై సానియా మీర్జా తండ్రి మరింత లోతుగా చెప్తూ.. ముస్లిం మహిళలకు భర్త అనుమతి లేకుండానే ఏకపక్షంగా విడాకులు తీసుకునే హక్కులు ఉంటాయని.. దాన్నే ఖులా అంటారని.. నా కుమార్తె కూడా ఇప్పుడు అదే మార్గాన్ని ఎంచుకున్నట్టు ఆమె తండ్రి పేర్కొన్నారు.
