భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ కారు ప్రమాదంలో తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఆ సమయంలో ప్రవీణ్‌కుమార్, ఆయన కుమారుడు కూడా కారులో ఉన్నారు. ల్యాండ్రోవర్లో పాండవనగర్ నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు బాగా దెబ్బతినగా, ప్రవీణ్ కుమార్, అతని కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు తెరిచి దర్యాప్తు జరుపుతున్నారు.
