బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ప్రదమైన సీఎం హోదాలో ఉండి గల్లీ లీడర్‌గా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ( సోమవారం) భువనగిరి పట్టణంలో ప్రిన్స్ కార్నర్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు.
పాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్, కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో నాడు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా రాష్ట్రంగా నిలిస్తే… కాంగ్రెస్ పాలనలో రెండు నెలులు గడవకముందే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు
The post భువనగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం appeared first on tnewstelugu.com.
