ప్రభుత్వ నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా 2000 పడకల నూతన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌కు ఇరువైపులా 1,000 పడకల టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం, పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా నిమ్స్ విస్తరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ నిమ్స్ నూతన భవనాన్ని ఎనిమిది అంతస్తుల్లో నిర్మిస్తే మొత్తం పడకల సంఖ్య 1500 నుంచి 3500కు పెరుగుతుందని తెలిపారు. రానున్న కాలంలో సూపర్ స్పెషలైజ్డ్ మాతా శిశు ఆరోగ్య సంరక్షణ ఆసుపత్రిని నిర్మిస్తే 200 పడకలు అదనంగా వస్తాయని, ఒక్క నిమ్స్ లోనే 3,700 పడకలను అందించగలమన్నారు. ఫలితంగా నిమ్స్ సేవలు విస్తృతం కానున్నాయి. నిమ్స్ ఎంసీహెచ్ పనులు వేగవంతం చేయాలి. దీంతో పాటు గాంధీ ఆస్పత్రిలో 200 పడకల సూపర్ స్పెషలైజ్డ్ మాతా శిశు ఆరోగ్య విభాగాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇది ప్రారంభమైతే దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ తెలంగాణగా నిలుస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు.
