మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు పంపించింది. విచారణకు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు పంపించడం ఇది ఆరోసారి. ఈ నెల 19వ తేదీన మద్యం కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది. ఇదివరకు ఐదుసార్లు వివిధ కారణాలతో అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు.
కేజ్రీవాల్‌ను అంతకుముందు ఫిబ్రవరి 2న, జనవరి 18న, జనవరి 3న, 2023 డిసెంబర్ 21, నవంబర్ 2 తేదీల్లో ఈడీ విచారణకు పిలిచింది. అయితే ఈ నోటీసులు చట్టవిరుద్ధమంటూ ఆయన విచారణకు హాజరుకాలేదు. అయితే కేజ్రీవాల్ విచారణకు హాజరు కావాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఈడీ 6వ సారి నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి ఉద్దేశ్యపూర్వకంగా సమన్లను ధిక్కరిస్తున్నారని, కుంటి సాకులు చెబుతున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధి చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే సామాన్యులకు ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని కోర్టుకు తెలిపింది ఈడీ.కేజ్రీవాల్‌ను విచారించేందుకు తమ దగ్గర సరైన ఆధారాల ఉన్నాయని చెప్పింది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ బురద రాజకీయాలకు పాల్పడుతోంది
