ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇవాళ(సోమవారం) మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. తనకు మూడు రోజులు బెయిల్ ఇవ్వాలని మనీష్ సిసోడియా రూస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఈ మూడు రోజులు మనీష్ సిసోడియా తన మేనకోడలు వివాహానికి హజరవుతారని సమాచారం.
ఇది కూడా చదవండి: విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్
