గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా.. అందరు దైర్యంగా ఉండండి భవిష్యత్ మనదే అని పేర్కొన్నారు హరీష్ రావు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ కార్యకర్తలు అద్భుతంగా మాటాడారు ..క్షేత్ర స్థాయి వాస్తవాలు చెబుతున్నారు.
ఉద్యమ కారులు మాట్లాడిన మాటలు పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా చేశాయి. బీ ఆర్ ఎస్ కు విజయాలతో పాటు అపజయాలు ఉన్నాయి. గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా. 2009 లో మనకు పది సీట్లే వచ్చాయి ..ఇక పని అయిపోయిందని కేసీఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా ? ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే. భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దు .భవిష్యత్ లో వచ్చేది మళ్ళీ మనమే అని పేర్కొన్నారు హరీష్ రావు.
