మేడ్చల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి క్వాలీస్ పల్టీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లంపేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ముందున్న కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో క్వాలీస్ పల్టీలు కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నర్సింహులు(35) అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం హస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read.. మాజీ ఎమ్మెల్యే గండ్రపై అక్రమ కేసులు
The post మల్లంపేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం appeared first on tnewstelugu.com.
