సినీ నటుడు మహేశ్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు అయితే.. ఈ మూవీ ఇప్పడు వివాదంలో చిక్కుకుంది. తాను రచించిన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవల నుంచి ఈ సినిమా కథను మక్కీకి మక్కీ దించేశారని రచయిన శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా శరత్ చంద్రకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కొరటాల శివ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది.
ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మహేశ్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం మహేశ్ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది. రచయిత శరత్ చంద్ర మహేశ్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ పై కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
గతంలోనే తాను మహేశ్ బాబుకు నోటీసులు పంపానని… అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు శరత్ చంద్ర. మహేశ్ పై సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: కేంద్ర జలవనరులశాఖ మంత్రిని కలిసిన బీఆర్ఎస్ ఎంపీలు
The post మహేశ్ బాబుపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా appeared first on tnewstelugu.com.
