హైదరాబాద్ లోని పాత సచివాలయం సమీపంలోని మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వ బుక్ ప్రింటింగ్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ప్రింటింగ్ ప్రెస్‌లోని పుస్తకాలు, ముద్రణాయంత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీటింగ్ వెనుక రహస్యం అదే ?
