మిజోరాంలోని లెంగ్‌పురు విమానాశ్రయంలో మయన్మార్ ఆర్మీ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఎయిర్‌పోర్ట్ లోని టెర్మినల్‌కు చేరుకోకముందే ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను లెంగ్‌పురు ఆసుపత్రిలో చేర్చారని మిజోరం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు.
మయన్మార్ సైన్యం, పౌర సైన్యం మధ్య ఘర్షణల కారణంగా కొన్నాళ్ల క్రితం లాంగ్ట్లై జిల్లా నుండి పారిపోయిన మయన్మార్ సైనికులను భారత్‌లోకి చొరబడ్డారు. ఈ క్రమంలోనే వారిని వెనక్కి తీసుకెళ్లేందుకు మయన్మార్ నుంచి సైనిక విమానం వచ్చింది. తాజాగా జరిగిన ప్రమాదం సమయంలో విమానంలో 14 మంది ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న వేవ్ పార్లమెంట్ ఎన్నికల్లో రివర్స్ కావొచ్చు
