రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటిస్తోంది. ఈమధ్యే యానిమల్ మూవీతో మంచి హిట్ దక్కించుకుంది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ లో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా ఓనెటిజన్ పెట్టిన కామెంట్ పై రష్మిక స్పందించింది. ఓకింత అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వార్తలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటూ గట్టిగా ఇచ్చిపడేసింది.
కిషోర్ తిరుమల డైరెక్షన్ లో శర్వానంద్, రష్మిక జంట నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. రాధికా, ఖుష్భు, ఊర్వశీ ప్రధానపాత్రల్లో నటించారు. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా స్క్ట్రిప్ రష్మికకు నచ్చలేదు..అయినా ఈ సినిమాకు సంతకం చేసింది అంటూ విచారం వ్యక్తం చేస్తున్న ఏమోజీలను షేర్ చేశాడు. దీనిపై రష్మిక స్పందిస్తూ ఎవరు చెప్పారు..స్క్రీప్ట్ నాకు నమ్మకం ఉంటేనే సినిమాలు చేస్తాను ఆ సినిమా యూనిట్ తో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటూ తలపట్టుకున్న ఎమోజీలతో సమాధానం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారుకు ప్రమాదం
