వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ భారత న్యాయ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని కాంగ్రెస్ పార్టీ తనకు తెలియజేయలేదని దీదీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఇండియా కూటమిలో దీదీ బాగాస్వాయం ప్రశ్నార్దమైంది. తాజాగా ఈ విషయంపై మమతా బెనర్జీ మాట్లాడుతూ..
“మర్యాదగా కూడా వారు నా రాష్ట్రానికి వస్తున్నారని కాంగ్రెస్ చెప్పలేదు. రాష్ట్రంలో ఎన్నికల కోసం నేను కాంగ్రెస్ పార్టీతో లేదా ఇతరులతో చర్చలు జరపలేదు. మేము ఒక ప్రతిపాదనను ఇచ్చాము, దానిని వారు తిరస్కరించారు. అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగానే పోరాడాలని మా పార్టీ నిర్ణయించింది’ అని బెనర్జీ మీడియా ప్రతినిధులతో అన్నారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత న్యాయ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని కాంగ్రెస్ పార్టీ తనకు తెలియజేయకపోవటమే మమతా అసంతృప్తికి కారణం అని అంటున్నారు.
