సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ పై అసభ్య పదజాలం ప్రయోగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పోలీసులు ముందుగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్ పై సర్కార్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టువంటివదని కవిత ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే , దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుంది.…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విధానాలు అవలంభించిదో ప్రజలకు తెలుసు అన్నారు. తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సూర్యునిపై ఉమ్మేస్తే వచ్చి మీ మీదనే పడుతుందన్న విషయాన్ని యాదించుకోవాలన్నారు. బీఆర్ఎస్ అధినేతపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకమైనవని వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: మగువలకు అదిరే వార్త..తగ్గిన పసిడి ధరలు.!!
