అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపార్జోయ్ తుఫాను ముంబైని ముంచెత్తింది. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా ముంబై విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా విమానాలు రద్దు చేయబడ్డాయి మరియు మరికొన్ని దారి మళ్లించబడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా పరిస్థితిపై ఎయిర్ ఇండియా స్పందించింది. వాతావరణం కారణంగా ముంబై విమానాశ్రయంలో రన్వే తాత్కాలికంగా మూసివేయబడింది. దీంతో కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రద్దు చేయబడ్డాయి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
మరోవైపు బిపాజోయ్ తుపాను గురువారం (ఈ నెల 15) గుజరాత్లోని కచ్, పాకిస్థాన్లోని కరాచీ మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమై ఉందని చెబుతున్నారు. మత్స్యకారులు జూన్ 15 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ సూచించింది.
