
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన క్యాబినెట్ ముఖ్య సలహాదారుగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (రిటైర్డ్ ఐఎఎస్)ని నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వీరి పదవీకాలం మూడేళ్లు. తనను ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమించినందుకు మాజీ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
