
మెదక్ జిల్లా చేగుంట హైవే బైపాస్ రోడ్డుపై ఘోర ప్రమాదం. ఒక ప్రైవేట్ టూర్ బస్సు U-టర్న్ చేస్తున్నప్పుడు EMS మరియు కంపెనీ బస్సును ఢీకొంది. దీంతో కంపెనీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది కార్మికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న రవిశంకర్ రెడ్డి అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
