మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇవాళ( (శుక్రవారం) కొల్చారం దగ్గర జరింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాద వశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కొల్చారం మండల కేంద్రంకు చెందిన ఆరిఫ్ (55) అక్కడికక్కడే మృతి చెందగా మాజీ వార్డు సభ్యుడు మహ్మద్ (48) అసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.
ఆ ఇద్దరు వ్యక్తులు కౌడిపల్లి నుంచి కొల్చారం వచ్చే క్రమంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ దవాఖానకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మిషన్ పార్లమెంట్.. అట్టహాసంగా బీఆర్ఎస్ సమావేశం
