మేడ్చల్లోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ 6 దగ్గర నిన్న(సోమవారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు.. ఎదురుగా వస్తున్న ఇన్నోవాను ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా… మరొకరు చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రకి తరలించారు. మృతులో ఒకరు వనస్థలిపురానికి చెందిన రెడ్డప్ప రెడ్డిగా గుర్తించినట్లు ఎస్ఐ నవీన్ రెడ్డి తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి:హైదరాబాద్ లో నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ అరెస్ట్..భారీగా గ్రడ్స్ స్వాధీనం
