వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తాజాగా ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది. మొన్నటివరకు తెలంగాణలో పార్టీనడిపిన ఆమె తాజాగా కాంగ్రెస్ లో వైఎస్సార్టీపిని విలీనం చేసింది. వెనువెంటనే ఆమెకి ఆంద్ర ప్రదేశ్ పీసీసీ పగ్గాలు సైతం అందాయి. దాంతో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. అయితే తన కొడుకు రాజారెడ్డి వివాహనా ఆహ్వానాలను పలువురు రాజకీయనాయకులకు అందజేస్తుంది. మొదటగా అన్న సీఎం జగన్ కి ఆహ్వానం అందజేసిన షర్మిల ఆ తరువాత రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ లకు ఇన్విటేషన్ ఇచ్చింది.
ఇక అట్లూరి ప్రియతో రేపు (జనవరి 18) హైదరాబాద్ లో రాజారెడ్డి నిశ్చితార్థం జరగనుంది. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ రేపు హైదరాబాద్ వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం 6.45 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి.. రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని రాత్రి 8 గంటలకు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో జరుగనున్న తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొననున్నారు. అనంతరం, రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి తిరిగి ప్రయాణం అవుతారు.
