భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. మొక్కలకు నీళ్లు పడుతుండగా ట్రాక్టర్ బోల్తా పడ్డ ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన గుండాల మండలం సాయనపల్లి గ్రామ పంచాయతీలో జరిగింది. ట్రాక్టర్ ట్యాంకర్ తో మొక్కలకు నీళ్లు పడుతుండగా ప్రమాదశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ రాముర్తి(32) అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read.. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్: మళ్లీ వరల్డ్ నంబర్ 1గా సాత్విక్, చిరాగ్ జోడీ
The post మొక్కలకు నీళ్లు పడుతుండగా.. ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి appeared first on tnewstelugu.com.
