దేశంలోని టాప్ 10 గ్యాంగ్‌స్టర్లలో ఒకడైన దీపక్ బాక్సర్ పోలీసులకు చిక్కాడు. దీపక్‌ను ఢిల్లీ స్పెషల్ పోలీసులు మెక్సికోలో అరెస్టు చేశారు. పలు కేసుల్లో నిందితుడైన దీపక్ పరారీలో ఉన్నాడు. ఎఫ్‌బీఐ సాయంతో ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. త్వరలోనే అతడిని భారత్‌కు తీసుకెళ్లనున్నారు. అమెరికా గూఢచార సంస్థలైన ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్ సహాయంతో దీపక్‌ను మెక్సికో సమీపంలో పట్టుకున్నారు.
ఢిల్లీ సివిల్ లైన్ బిల్డర్ అమిత్ గుప్తా హత్య కేసులో బాక్సర్ దీపక్ పై పోలీసులు కొన్నాళ్లుగా వేట సాగిస్తున్నారు. రోహిణి కోర్టులో జితేంద్ర గోగి హత్య తర్వాత, బాక్సర్ దీపక్ స్థానిక గోగి గ్యాంగ్‌పై నియంత్రణ సాధించాడు. అతను జనవరి 2023లో మెక్సికోకు పారిపోయాడు. రవి అంటిల్ పేరుతో నకిలీ పాస్‌పోర్ట్‌తో దీపక్ కోల్‌కతా పారిపోయాడు.
