యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంతో పాటు వర్గల్ ఆలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. తొలిసారిగా తెలంగాణలోని రెండు ఆలయాలకు భోగ్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సంవత్సరం దేశంలోని 70 దేవాలయాలు సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
Also Read.. అమానవీయం. చెత్తకుప్పలో దొరికిన అప్పుడే పుట్టిన మగ శిశువు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్.ఎస్.స్.ఏ.ఐ) ప్రతి యేట జాతీయ సర్టిఫికెట్ ‘భోగ్’ (బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్)ను అందిస్తుంది. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్ బృందం ఆలయాలను సందర్శించి.. భోగ్ గుర్తింపునకు రిఫర్ చేసింది.ఎఫ్ఎస్ఎస్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమల వర్ధన్రావు శనివారం ఆలయ అధికారులకు భోగ్ సర్టిఫికెట్ ను అందజేశారు.
The post యాదాద్రి, వర్గల్ ఆలయాలకు భోగ్ సర్టిఫికెట్ appeared first on tnewstelugu.com.
