యాదాద్రి భువనగిరి : యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఒకే రోజు మొత్తం రూ. రూ: 45,52,569 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,50,250, కైంకర్యములు- రూ.2,100, సుప్రభాతం – రూ.6,100, పుష్కరిణీ – రూ. 3,000, బ్రేక్ దర్శనం – రూ.3,84,900, వ్రతాలు – 1,05,600 ,వాహన పూజలు – రూ.31,600, వీఐపీ దర్శనం ద్వారా రూ.6,90,000 సమకూరిందని వెల్లడించారు.
Also Read.. మెట్రో గుడ్ న్యూస్.. నేడు, రేపు అన్ లిమిటెడ్ రైడ్స్
అదే విధంగా ప్రచారశాఖ ద్వారా రూ.77,670, పాతగుట్ట ద్వారా రూ.36,290, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.7,00,000, యాదరుషి నిలయం ద్వారా రూ.1,40,154, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,51,264, శివాలయం ద్వారా రూ.13,500, ప్రసాద విక్రయం ద్వారా రూ.18,87,700, కల్యాణ కట్ట ద్వారా రూ.90,000, అన్నదానం ద్వారా రూ.82,441 ఆదాయం ఆలయానికి సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.
