విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన ఫౌండర్స్ ల్యాబ్‌ను హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలోని రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అనేక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం టీ-హబ్, టీ-వర్క్స్, అగ్రి హబ్, వీ-హబ్ వంటి అనేక వేదికలను ఏర్పాటు చేసిందన్నారు. మంచి అభివృద్ధి.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన ఫౌండర్స్ ల్యాబ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఫౌండర్స్ ల్యాబ్ ఫౌండర్ సీఈవో శకుంతల కాసరగడ్డ మాట్లాడుతూ ఫార్మాస్యూటికల్, అగ్రికల్చర్, మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ రంగాలను అనుసంధానం చేయడం ద్వారా సమాజానికి అవసరమైన అనేక ఆవిష్కరణలను విద్యార్థులు ఆవిష్కరించవచ్చని అన్నారు. ఈ క్రమంలో విద్యాసంస్థలు, ప్రభుత్వ సహకారంతో వారికి అన్ని విధాలుగా పూర్తి సహకారం అందించి ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని సేవలను సంస్థ అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఐఏఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, పైలట్ రోహిత్ రెడ్డి, కంపెనీ డైరెక్టర్ సత్యప్రసాద్ పెదపదెల్లి పాల్గొన్నారు.
యువతకు గొప్ప అవకాశం.. The post మంత్రి కేటీఆర్ చొరవతో ఫౌండర్స్ ల్యాబ్ సంస్థ appeared first on T News Telugu.
