యూపీఎస్సీ ఇవాళ(బుధవారం) నోటిపికేషన్ రిలీజ్ చేసింది.ఐఏఎస్, ఐపీఎస్‌తో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసుల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నోటిపికేషన్ జారీ చేసింది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్-2024 దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఇవాళ (ఫిబ్రవరి 14, 2024) ప్రారంభమైంది. మార్చి 5, 2024 అప్లికేషన్లకు చివరి తేది.దరఖాస్తులను ఆన్ లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన యూనివర్శిటీ పరిధిలోని విద్యాసంస్థల్లో డిగ్రీ లేదా సమానమైన కోర్సు పూర్తి చేసినవారు దరఖాస్తుకు అర్హులు.. జనరల్ అభ్యర్థులు గరిష్ఠంగా ఆరుసార్లు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాయొచ్చు. అయితే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ, వికలాంగ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కి చెందిన వారు అపరిమిత సంఖ్యలో ప్రయత్నించవచ్చు. ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు ప్రయత్నించవచ్చు. వికలాంగ కేటగిరికి చెందిన జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు గరిష్టంగా 9 సార్లు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి ప్రిలిమినరీ పరీక్షలో ఏదైనా ఒక పేపర్ పరీక్ష రాస్తే ఒక ప్రయత్నం చేసినట్టుగా లెక్కిస్తారు.
దీనికి సంబందించి మరింత సమాచారం తెలుసుకునేందుకు అభ్యర్థులు. upsc.gov.in, upsconline.nic.in వెబ్‌సైట్లను లాగిన్ కావాల్సిందిగా అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ చెప్పేదొకటి చేసేదొకటి
The post యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల appeared first on tnewstelugu.com.
