
న్యూఢిల్లీ: ఇక నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపుల గురించి ఆలోచించాలి. ఎందుకంటే.. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజు ఉంటుంది. UPI డేటాను పర్యవేక్షిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తన తాజా ఆర్డర్లో రూ. 2,000 కంటే ఎక్కువ లావాదేవీలపై 1.1 శాతం వరకు ఇంటర్చేంజ్ ఫీజును విధించనున్నట్లు తెలిపింది. అందువల్ల, వ్యాపారులు ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.15 చెల్లించాలి. అయితే, వ్యాపారులు సహజంగానే ఈ రుసుమును కూడా వినియోగదారుల నుండి వసూలు చేస్తారు. తద్వారా ఆ మేరకు వినియోగదారుల జేబులకు చిల్లు పడింది.
