ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలరాంపూర్‌లో ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. శ్రీధర్త గంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని డియోరియా మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
The post యూపీలో కారు ఢీకొని ఆరుగురు మృతి appeared first on T News Telugu.
