తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారిగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ యాగె మల్లేశం కుర్మ, ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం, గొల్ల కుర్మ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ప్రభుత్వానికి దొడ్డి కొమురయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డికొమురయ్య జయంతిని అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, 75 ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా దొడ్డికొమురయ్య త్యాగాన్ని గుర్తించలేదని.. సాయుధ పోరాటంలో అసువులు బాసిన చరిత్ర తర్వాత.