ప్రముఖ నటుడు హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారని, పార్టీ అధ్యక్షుడిగా విజయ్ ఎన్నికయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల కమిషన్ దగ్గర పార్టీని నమోదు చేసే ప్రక్రియ చేపడుతున్నామని ఆ పార్టీలోని కీలక సభ్యుడు ఒకరు మీడియాకు తెలిపారు. ఇటీవల జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశానికి 200 మంది సభ్యులు హాజరయ్యారని సమాచారం. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శితోపాటు, కోశాధికారిని నియమించారు. కేంద్ర కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పేరు, రిజిస్ట్రేషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ కౌన్సిల్ విజయ్ కు అప్పగించించినట్లు తెలుస్తోంది. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ తన రాజకీయ పార్టీని ప్రజల ముందుకు తీసుకువస్తారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ పార్టీ పేరులో తమిళనాడు సంప్రదాయాలకు అనుగునంగా ‘కజగం’ అనే పదం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు విజయ్ 68 సినిమాల్లో నటించారు. అంతేకాదు విజయ్ కి పలు అభిమాన సంఘాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్న వారే భవిష్యత్తు నాయకులు
