ఏపీ సీఎంకు షాకిచ్చింది హైకోర్టు. రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్ కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టే కొనసాగించేందుకు కోర్టు నిరాకరించింది. రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాతే ధ్రువపత్రం జారీ చేసిందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
సీఎం జగన్, ప్రభుత్వ ప్రతిష్టను దిగాజార్చేందుకు ఈ మూవీ తీశారని..గతేడాది డిసెంబర్ 18వ తేదీన సీబీఎఫ్ సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈమధ్యే హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈనెల 13న విచారణ జరిపిన కోర్టు సినిమా ను తాత్కాలికంగా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా శుక్రవారం విచారణ చేపట్టి సినిమా విడుదలకు అంగీకారం తెలిపింది.
ఇది కూడా చదవండి: జియో బంపర్ ఆఫర్…90రోజుల రీఛార్జ్ ప్లాన్ తో 180జీబీ ఇంటర్నెట్ ఫ్రీ..!!
The post రాజధాని ఫైల్స్.. ఏపీ సీఎంకు షాక్..!! appeared first on tnewstelugu.com.
