రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం దీనిపై స్పందించలేదు.
దీంతో స్తలం హైకోర్టుకి ఇవ్వవద్దని కోరుతూ నిరసన చేపడుతున్న విద్యార్థులు శుక్రవారం అగ్రికల్చర్ యూనివర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంతో పాటు వివిధ విభాగాలు కళాశాలలోకి అధికారులను, శాస్త్రవేత్తలను అధ్యాపకులు పోకుండా అడ్డుకుంటామని విద్యార్థులు తెలిపారు.
The post రాజేంద్రనగర్ లో ఉద్రిక్తత.. జయశంకర్ యూనివర్సిటీ బంద్..! appeared first on tnewstelugu.com.
