నిరుద్యోగులకు శుభవార్త. బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వాల తీపి కబురు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. విద్యాశాఖ చివరిసారిగా గతేడాది జూన్ 12న టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే.
విద్యాశాఖలో దీర్ఘకాలిక సమస్యలు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, మన గ్రామాలు, పాఠశాలల్లో పురోగతిపై శుక్రవారం మంత్రుల ఉపసంఘం సమావేశమైంది.
హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రి హరీశ్‌రావు, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి (జగదీశ్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు.. ఈ సమావేశానికి విద్యాశాఖ హాజరయ్యారు. వివిధ అంశాలపై చర్చించిన అనంతరం మంత్రివర్గ ఉపసంఘం తిరిగి సమావేశం కావాలని నిర్ణయించింది.
‘టెట్’ రాబోతోంది.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..! appeared first on T News Telugu
