రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి (మంగళవారం) నుంచి రేపు (బుధవారం) ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
బుధవారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కారణంగా ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
