హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా ఈరెండిలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ప్రధానంగా పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు అల్పస్థాయి గాలులు వీస్తున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఖమ్మం, ములుగు, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, కోట గూడెం, సూర్యాపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండలో నేడు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
