అందరి చూపు అయోధ్య వైపే ఉంది. కానీ ఎలా వెళ్లాలనేదే ప్రశ్నార్థకంగా మారింది. రామమందిరం దర్శనానికి అనుమతించడంతో నగరం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలు తరలివెళ్లే అవకాశం ఉంది. ఇలా భక్తుల రద్దీని పరిగణలోనికి తీసుకుని నగరం నుంచి 17 స్పెషల్ ట్రైన్స్ నడపాలని రైల్వే ఏర్పాట్లు చేసింది. రైల్వే బోర్డు ఆదేశాలతో రైల్వేలోని అన్ని జోన్లు అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే కూడా ఈనెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 29వ తేదీ వరకు మొత్తం 41 ట్రిప్పులను తిప్పుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇందులో సికింద్రాబాద్ నుంచి 17 స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. ఈనెల 29,31, ఫిబ్రవరి 2,5,7,9,11,13,15,17,18,19,21,23,25,27,29 తేదీల్లో ఈ రైళ్లు అయోధ్యకు వెళ్లనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు తోడు ప్రతిరోజు సికింద్రబాద్ నుంచి దానాపూర్ కు ఒక ఎక్స్ ప్రెస్ ట్రైన్ నడుస్తోంది. ఉదయం 9.25 గంటలకు బయలుదేరే ఈ రైలులో టిక్కెట్లు దొరకడం పెద్ద కష్టంగా మారింది. అందుకే ప్రతి శుక్రవారం నగరం నుంచి గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెన్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ రైలు నగరంలో ఉదయం 10.40 గంటలకు బయలుదేరి నేరుగా అయోధ్యకు మరసటి రోజు మధ్యాహ్నం 3.30గంటలకు చేరుకుంటుంది.
ఇది కూడా చదవండి : ఖర్చులను తగ్గిస్తూ ఆర్టీసీలో ఆదాయం మార్గాలను అన్వేషించాలన్న డిప్యూటీ సీఎం..!!
The post రామభక్తులకు శుభవార్త. సికింద్రాబాద్ నుంచి అయోధ్యుకు 17 స్పెషల్ ట్రైన్స్..!! appeared first on tnewstelugu.com.
