ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తనకు ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వ్యక్తిగతంగా లేదా కొరియర్ ద్వారా.. ఏ రూపంలోనూ ఆహ్వానం రాలేదన్నారు. ఒకవేళ తనకు పోస్ట్ ద్వారా పంపినట్లు ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
ఆయన శుక్రవారం సమాజ్‌వాది పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తనను ఆహ్వానించకుండా వారు అవమానించారని మండిపడ్డారు. తనకు ఇప్పటి వరకు ఆహ్వానం రాలేదన్నారు. పోస్టల్ ద్వారా పంపించి ఉంటారని ఓ మీడియా ప్రతినిధి చెప్పగా… అలా పంపిస్తే ఆధారాలు చూపించాలన్నారు. ఒకవేళ తన చిరునామాకే పంపించారా? అన్నది చూడాలన్నారు.
The post రామమందిర ప్రాణప్రతిష్ఠకు నాకు ఆహ్వానం అందలేదు appeared first on tnewstelugu.com.
