చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం హనుమాన్. మహేష్ బాబు గుంటూరు కారం మూవీని తట్టుకుని బాక్సాఫీస్ దెగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తోలి భారతీయ సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ తిరిగే కథ ఇది. హనుమంతుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వచ్చే ప్రతి టికెట్ పై 5రూపాయలని రామమందిరానికి విరాళంగా ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన హనుమాన్ చిత్ర యూనిట్.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.
అనుకున్నట్టే ఇప్పటి వరకు వచ్చిన రూ. 2,66,41,055ను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 53,28,211 టికెట్లు అమ్ముడుపోగా ఒక్కో టికెట్ నుంచి రూ. 5 చొప్పున ఇంత మొత్తం అయినట్టు చెబుతూ వివరాలను వెల్లడించింది. ప్రజల విరాళాలతో రామాయలం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఇచ్చిన విరాళాలతో రేపు అత్యంత ఘనంగా అయోధ్యలో రాముడు కొలువు దీరనున్నాడు. దేశ నలువైపులా నుండి వస్తున్న సెలబ్రెటీలే కాకుండా యావత్ హిందూ ప్రపంచం ఈ ఘట్టం కోసం ఎదురుచూస్తుంది.
The post రాముడికి ‘హనుమాన్’ భారీ విరాళం..! appeared first on tnewstelugu.com.
